Site icon Prime9

Daaku Maharaj: ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు – కారణమేంటంటే!

Daaku Maharaj Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా అనంతపురంలో డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించాలని మూవీ టీం నిర్ణయించింది.

ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్‌ వస్తున్నట్టు కూడా సమాచారం. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌ని మూవీ టీం క్యాన్సిల్‌ చేసినట్టు సమాచారం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌ని రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. “తిరుపతిలో జరిగిన విషాద ఘటనకు మా చిత్ర బృందాన్ని తీవ్రంగా బాధిస్తోంది. పవిత్ర స్థలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం హృదయ విదారకంగా ఉంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్రణాళిక ప్రకారం కొనసాగించడం సముచితం కాదని మేము భావిస్తున్నాం. బరువైన హృదయంతో, ప్రజల మనోభావాల పట్ల అత్యంత గౌరవంతో మేము ఈరోజు అనంతపురంలో జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము” అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తన ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించని విషయం విధితమే. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 41 మంది గాయపడినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar