Daaku Maharaj Making Video: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా వచ్చిన ఈ సినిమా బాలయ్య వైల్డ్ లుక్ లో కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో విజృంభించాడు. బాబీ విజన్, తమన్ మ్యూజిక్, బాలయ్య యాక్షన్ కాంబో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.
అదిరిపోయేలా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇక సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన డాకు మహారాజ్ టీం తెరక వెనుక పడిన శ్రమను మేకింగ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాజాగా డాకు మహారాజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీం. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ తో పాటు పలు కీలక సన్నివేశాల్లో నటించి ఆకట్టుకుంది. బాబీ డియోల్ విలన్ గా నటించారు. అలాగే బిగ్ బాస్ దివి, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించారు.