Site icon Prime9

Rama Raama Song Promo: విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌.. రామ రామ పాట ప్రోమో చూశారా?

Vishwambhara Rama Rama Song Promo: విశ్వంభర మూవీ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌పూ మూవీ టీం అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. చివరిలో ఓ సాంగ్‌ షూటింగ్‌ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. అయితే ఇప్పటి వరకు విశ్వంభర నుంచి ఫ్యాన్స్‌ ఆశించిన స్థాయిలో అప్‌డేట్‌ లేదు. దీంతో విశ్వంభర నుంచి ఓ మంచి అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్న తరుణంలో ఫస్ట్‌ సింగిల్‌ని రిలీజ్‌ చేస్తున్నట్టు గురువారం మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు.

 

విశ్వంభర ఫస్ట్ సింగిల్

రేపు (ఏప్రిల్‌ 12న) విశ్వంభర మొదటి సాంగ్‌ విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటన ఇచ్చింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమో రిలీజ్‌ చేసి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచారు. చిరంజీవి నోటి నుంచి జై శ్రీరామ్‌ అనే నినాదంతో ఈ పాట ప్రొమో మొదలైంది. శ్రీరాముడి ఉత్సవం బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాట సాగనుందని తెలుస్తోంది. బాల హనుమాన్‌లు ముందు నడుచుకుంటు వస్తుంటే వెనకాల చిరు నడుచుకుంటూ వస్తు కనిపించారు.  రామ రామ అంటూ సాగే ఈ పాట ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఫుల్‌ సాంగ్‌ వెయిటింగ్‌ అంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు.

Vishwambhara - Rama Raama Song Promo | Megastar Chiranjeevi | Vassishta | MM Keeravaani

 

అదిరిన ప్రొమో సాంగ్

శనివారం ఉదయం 11.12 గంటలకు ఈ పాట విడుదల చేయనున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రీ సంగీతం అందించాడు. శంకర్‌ మహాదేవన్‌, లిప్సిక ఈ పాటను ఆలపించారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపించనున్నాడు. సోషియో ఫాంటసిగా వస్తున్న ఈ సినిమాకు డివోషనల్‌ టచ్‌ ఇచ్చాడు వశిష్ట. ఈ సినిమాతో త్రిష, ఆషిక రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. కునాల్‌ కపూర్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Exit mobile version
Skip to toolbar