Site icon Prime9

Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ – ఎట్టకేలకు ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్‌డేట్‌, ఫస్ట్‌ సింగిల్‌ రెడీ!

Vishwambhara First Single Update: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసిగా రూపొందుతున్న ఈ సినిమాలో చిరు ఆంజనేయ భక్తుడిగా కనిపించనున్నాడు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడింది.

 

ఇప్పటి వరకు కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించలేదు.పైగా సినిమా నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్స్‌ రావాడం లేదు. దీంతో విశ్వంభర విషయంలో మెగా అభిమానులంత ఆందోళనగా ఉన్నారు. మూవీ రిలీజ్‌ డేట్‌, అప్‌డేట్స్‌ ఎప్పుడెప్పుడు వస్తాయా ఈగర్‌గా వేయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ అందించారు మేకర్స్‌. విశ్వంభర నుంచి త్వరలోనే ఓ క్రేజీ అప్‌డేట్‌ని వదలుతున్నామంటూ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది.

 

ఆ రోజే ఫస్ట్ సింగిల్

విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌ ‘రామ రామ’ రెడీ అయ్యిందని, హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 12న ఈ పాటను విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చారు. ఈ సాంగ్ లో హీరో సాయి దుర్గ తేజ్, నిహారికలు కూడా కనిపించనున్నారని టాక్.  ఎట్టకేలకు విశ్వంభర నుంచి అప్డేట్ రావడంతో  ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు. బెసిగ్గా చిరంజీవి హనుమాన్‌ భక్తుడనే విషయం తెలిసిందే. విశ్వంభరలోనూ ఆయన హనుమాన్‌ భక్తుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు విడుదల కానున్న ఫస్ట్‌ సింగిల్‌ కూడా డివోషనల్‌ సాంగ్‌ కావడం విశేషం. రామ రామ అంటూ సాగే ఈ పాటకు సరస్వతి పుత్రుడు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించగా.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version
Skip to toolbar