Chiranjeevi Mother Hospitalised: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కొణిదెల అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆమె అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించినట్టు సమాచారం. చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి దంపతులు దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అంజనా దేవి చిన్న కుమారుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
తల్లి అనారోగ్యం నేపథ్యంలో నేడు ఆయన హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది. మరోవైపు దుబాయ్‌లో ఉన్న చిరంజీవి విషయం తెలియగానే ఫోన్ కాల్ ద్వారా తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్టు సమాచారం. కాగా అంజనాదేవికి ఐదుగురు సంతానం. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవలే అంజనాదేవి పుట్టినరోజును చిరు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలకు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.