Site icon Prime9

Chiranjeevi: ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను.. వాటి సంగతి పవన్ చూస్తాడు!

Chiranjeevi Gives clarity on Political Entry at BrahmaAnandam Pre-Release event: తాను ఎంత పెద్దలను కలిసినా సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమేననిమెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇక, తన జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు చోటు లేదని చెప్పేశారు. మంగళవారం ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరు ఈ ప్రకటన చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని తన తమ్ముడు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారని చెప్పారు. ఎప్పటిలాగానే, సినీ పరిశ్రమ కోసం నేతలను నాయకులందరితో తన అనుబంధం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

కళామతల్లి సేవలోనే..
బ్రహ్మానందం, గౌతమ్ కీలక పాత్రలో నటించిన సినిమా బ్రహ్మా ఆనందం. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇకపై, సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

ఇక.. ఆ పని పవన్‌దే
ఇటీవలి కాలంలో తాను కొందరు పెద్ద నేతలను కలుస్తుండటంతో పలువురికి కొత్త అనుమానాలు వస్తున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. ‘చాలామందికి డౌట్స్ వస్తున్నాయి.. పెద్ద పెద్ద వాళ్లకు దగ్గరవుతున్నాడు.. అటు వైపు వెళ్తాడా అని… అటువంటి డౌట్ వద్దు.. నా లక్ష్యాలు, సేవాభావాన్ని సాధించడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు’అని చిరంజీవి చెప్పారు.

Exit mobile version
Skip to toolbar