Site icon Prime9

Chiranjeevi Arrives London: లండన్‌ చేరుకున్న చిరంజీవి – ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కి ఘనవస్వాగతం

Chiranjeevi Arrives London: మెగాస్టార్‌ చిరంజీవి లండన్‌ చేరుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌ – యూకే పార్లమెంట్‌లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. యూకె అధికార లేబర్‌ పార్టీ పార్లమెంట్‌ మెంబర్‌ నవేందు మిశ్రా రేపు (మార్చి 19) చిరంజీవిని సన్మానించనున్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా సినీ, సేవా రంగాల్లో ఆయన అందించిన విశేష సేవలు, కృషికి గానూ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌ మన్‌ సహా ఇతర పార్లమెంట్‌ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు చిరు రాత్రి లండన్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన చిరుకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆయన చూసేందుకు ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వెల్‌కమ్‌ అన్నయ్యా అంటూ ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. చిరంజీవి వారితో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన విశ్వంభర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ మూవీ సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం సెట్స్‌లో ఉండగానే చిరు అప్పుడే మరో రెండు ప్రాజెక్ట్స్‌ లైన్‌లో పెట్టారు. దసరా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కి కమిట్‌ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. అలాగే హిట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అలాగే చిరు కోసం అనిల్‌ రావిపూడి మంచి కథను రెడీ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar