Comedian Devraj Patel : యూట్యూబ్‌ స్టార్‌ దేవ్‌ రాజ్‌ పటేల్‌ మృతి.. సంతాపం తెలిపిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం

చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన ప్రముఖ కమెడియన్‌, యూట్యూబ్‌ స్టార్‌ "దేవ్‌ రాజ్‌ పటేల్‌" రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  రాయపూర్‌లో ఓ షూటింగ్‌కు వెళుతుండగా ఈ యాక్సిడెంట్‌ జరిగిందని తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో దేవ్ కి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 12:40 PM IST

Comedian Devraj Patel : చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన ప్రముఖ కమెడియన్‌, యూట్యూబ్‌ స్టార్‌ “దేవ్‌ రాజ్‌ పటేల్‌” రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  రాయపూర్‌లో ఓ షూటింగ్‌కు వెళుతుండగా ఈ యాక్సిడెంట్‌ జరిగిందని తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో దేవ్ కి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం దేవ్ వయస్సు 22 ఏళ్లు. చిన్న వయస్సులోనే దేవ్ తుదిశ్వాస విడవడం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

దేవ్ కుటుంబం విషయానికి వస్తే.. చత్తీస్‌గఢ్‌ లోని డబ్బుపల్లి అనే గ్రామంలో వీరి కుటుంబం నివాసముంటున్నారు. దేవ్ తండ్రి ఘనశ్యామ్ పటేల్ ఒక సాధారణ రైతు. అతని తల్లి గౌరీ పటేల్ గృహిణి. అతనికి ఓ సోదరి, సోదరుడు ఉన్నారు. దేవ్ మరణ వార్తతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం మునిగిపోయారు.

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సోషల్‌ మీడియా వేదికగా దేవరాజ్‌ పటేల్‌ (Comedian Devraj Patel) మృతికి నివాళి అర్పించారు. ఆ పోస్ట్ లో.. దిల్ సే బురా లగ్తా హై’తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన దేవరాజ్ పటేల్.. మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతి చిన్న వయసులో తన అద్భుతమైన ట్యాలెంట్‌ను కోల్పోవడం చాలా బాధాకరం. తన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని.. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియయజేస్తున్నాను.. అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన దేవరాజ్‌ (Comedian Devraj Patel) ‘దిల్‌ సే బురా లగ్తా హై’ డైలాగ్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. యూట్యూబ్‌లో 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే దేవరాజ్‌కున్న ఫాలోయింగ్‌ను ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఈక్రమంలోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.