Site icon Prime9

Chhaava: తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైన బాలీవుడ్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఛావా’ – థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే!

Chhaava Telugu Version Release: బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్‌ హిందీ మూవీ ‘ఛావా’. డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో హిస్టారికల్‌ చిత్రంగా రూపొందింది. లవర్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. పాజిటివ్‌ రివ్యూస్‌, విమర్శకుల ప్రశంసలు అందుకుంటు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.

ఇప్పటి వరకు రూ.370 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం రూ.400 కోట్ల మార్క్‌ వైపు దూసుకెళుతోంది. అయితే ఛావా కేవలం ఒక్క హిందీ భాషలోనే విడుదలైంది. దీంతో దక్షిణాది ప్రేక్షకులు ఆయా భాషల్లో విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఛావాను తెలుగులో రిలీజ్‌ చేయాలని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్‌ వచ్చాయి. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఛావాను తెలుగులో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమయ్యారు. తెలుగు ఆడియన్స్‌ డిమాండ్స్‌ మేరకు ఛావాను తెలుగులో రిలీజ్‌ చేసేందుకు టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ముందుకు వచ్చింది.

ఈ మూవీ తెలుగు వెర్షన్‌ రైట్స్‌ తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. “ఛత్రపతి మహారాజ్‌ తనయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా మూవీ ఇప్పుడు తెలుగులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. మార్చి 7 నుంచి ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ థియేటర్లలో విడుదల కాబోతోంది” అని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్‌ వర్క్‌తో పాటు పొస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఇక హిందీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ చిత్రం తెలుగులో రిలీజ్‌ అవుతుండటంతో తెలుగు ప్రేక్షకులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. తమ కోరిక మేరకు సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నందుకు గీతా ఆర్ట్స్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Exit mobile version
Skip to toolbar