Site icon Prime9

Chandramukhi 2: లారెన్స్ హీరోగా చంద్రముఖి 2

Chandramukhi 2: ’చంద్రముఖి‘ దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు రూపొందించబడిన వినోదభరితమైన హారర్ డ్రామాలలో ఒకటి. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను చంద్రముఖి 2 పేరుతో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఈరోజు మైసూర్‌లో ప్రారంభమైన సందర్భంగా లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి ఆశీస్సులు తీసుకున్నారు. ట్విట్టర్‌లో రజనీకాంత్‌తో ఉన్న రెండు చిత్రాలను పంచుకుంటూ లారెన్స్ ఇలా రాసారు, “హాయ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్, ఈరోజు చంద్రముఖి 2 షూటింగ్ మైసూరులో నా తలైవర్ మరియు గురువు గారి @రజనీకాంత్ ఆశీస్సులతో ప్రారంభమవుతుంది! మీ విషెస్ నాకు కావాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

Exit mobile version