Bigg Boss Gangavva: బిగ్‌బాస్‌ 8 కంటెస్టెంట్‌ గంగవ్వపై కేసు

  • Written By:
  • Updated On - October 23, 2024 / 07:01 PM IST

Case Filed on Gangavva: యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో సందడి చేస్తున్న గంగవ్వపై తాజాగా కేసు నమోదైంది. వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ గంగవ్వతో పాటు మరో యూట్యూబర్‌ రాజుపై యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్‌ జగిత్యాల ఆటవీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆటవీ శాఖ అధికారులు గంగవ్వ, యూట్యూబర్‌ రాజుపై కేసు నమోదు చేశారు. వినోదం కోసం గంగవ్వ, రాజులు మూగ జీవాలను హించించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

బిగ్‌బాస్‌ షోతో ఫేం సంపాదించుకున్న గంగవ్వ మొదట యూట్యూబ్‌ ఛానల్‌తో మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్‌ షో’ అనే చానల్‌ ద్వారా గంగవ్వ గ్రామీణ నేపథ్యంలో వీడియోలు చేస్తూ ఫేమస్‌ అయ్యింది. ఈ క్రమంలో 2022లో గంగవ్వ, రాజుతో కలిసి చిలుక పంచాంగం పేరుతో ఓ వీడియో చేసింది. ఆ వీడియోలో గంగవ్వ, రాజులు జ్యోతిష్యులుగా నటించి వినోదం పండించారు. ఈ వీడియో కోసం వారు చిలుకను ఉపయోగించారు. చిలుకను పంజరంలో బంధించి జ్యోతిష్యులుగా నటించి నవ్వించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ వీడియో లక్షల్లో వ్యూస్వీ తెచ్చుకుంది. ఇందులో గంగవ్వ నిజమైన జ్యోతిష్యురాలిగా తన నటన, కామెడీతో మెప్పించింది. అయితే ఇప్పుడు ఇదే వీడియో గంగవ్వను, రాజును చిక్కుల్లో పడేంది. తమ స్వలాభం కోసం వారు మూగ జీవి అయిన చిలుకను బంధించారని, ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ IV సెక్షన్‌ కింద నేరమని గౌతమ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు అటవీ శాఖ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం మారింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న గంగవ్వపై కేసు నమోదవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.