Site icon Prime9

Fauji: ప్రభాస్‌ ‘ఫౌజీ’లో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌!

Anupam Kher in Prabhas Fauji: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం క్రియేటివ్‌ డైరెక్టర్‌ హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫౌజీ మూవీతో బిజీగా ఉన్నాడు. గతేడాది సలార్‌, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. ఫౌజీతో పాటు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్‌’ వంటి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్‌ 2, కల్కి 2, ఫౌజీ చిత్రాలపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ఫౌజీ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుటుంది.

గతేడాది ఆగష్టులో పూజ్‌ కార్యక్రమం జరుపుకుని ఏడాది చివరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ టీం లేటెస్ట్‌ అప్‌డేట్‌ అందించింది. ఇందులో బాలీవుడ్‌ లెజెండరి నటుడు అనుపమ్‌ ఖేర్‌ కూడా భాగమైనట్టు తాజాగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో ప్రభాస్, హను రాఘవపూడితో కలిసి అనుపమ్‌ ఖేర్‌ దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. “ఫౌజీ షూటింగ్‌ సెట్లోకి అనుపమ్‌ ఖేర్‌ అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు” మూవీ టీం పేర్కొంది.

అలాగే అనుపమ్‌ ఖేర్‌ కూడా ఈ విషయాన్ని చెబుతూ.. “ఇండియన్‌ సినిమా పరిశ్రమ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నా 544వ ప్రాజెక్ట్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ అద్భుతంగా ఉంది. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్‌” అని ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఫౌజీ సినిమాను పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు.

1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగనుంది. ఇందులో ప్రభాస్‌ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి, జయప్రద వంటి సీనియర్‌ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ యర్నేనీ, రవిశంకర్‌ యలమంచిలిలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఫౌజీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ ISC కెమెరామన్ గా వర్క్ చేస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar