Site icon Prime9

Bichagadu2 OTT: ఓటీటీ లోకి బిచ్చగాడు2.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగంటే?

Bichagadu 2

Bichagadu 2

Bichagadu2 OTT: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ రాబట్టింది. చెల్లెలి సెంటి మెంట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా ‘బిచ్చగాడు 2’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా జూన్ 18 నుంచి బిచ్చగాడు 2 అందుబాటులో ఉండనుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు.

 

బిచ్చగాడు కథ ఏంటంటే?(Bichagadu2 OTT)

ఇండియాలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ)ది ఏడో స్థానం! ఎన్నికల ఫండ్ పేరుతో సీఎంకు రూ. 5000 కోట్లు ఫండ్ ఇచ్చిన వ్యక్తి. అయితే, విజయ్ ఆస్తి మీద ఆయన స్నేహితుడు, కంపెనీలో పని చేసే అరవింద్ (దేవ్ గిల్) కన్ను పడుతుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో డాక్టర్ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి చెప్పింది వింటాడు. విజయ్ గురుమూర్తిని చంపేసి, అతని బాడీలో వేరొకరి బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి, ఆస్థి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు.

 

విజయ్ గురుమూర్తి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వ్యక్తి సత్య (విజయ్ ఆంటోనీ) దొరుకుతాడు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు బాడీ మాత్రం విజయ్ గురుమూర్తిది. బ్రెయిన్ ఏమో సత్యాది. విజయ్ గురుమూర్తి స్థానంలో సత్య బ్రెయిన్ వస్తే… తాము ఆడింది ఆట, పాడింది పాట అనుకున్న అరవింద్ & కోకు పెద్ద షాక్ తగులుతుంది. వాళ్ళను సత్య చంపేస్తాడు. ఎందుకు? అతని చెల్లెలు ఎవరు? చిన్నతనంలో జైలుకు ఎందుకు వెళ్ళాడు?అనే పలు ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

 

Exit mobile version