Site icon Prime9

Betting App Case: బెట్టింగ్‌ యాప్‌ కేసు – రానా, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మిలపై కేసు!

Betting App Case Filed in Rana, Vijay Devarakonda and Other Celebs: బెట్టింగ్‌ యాప్‌ వ్యవహరం రోజురోజుకు కీలకంగా మారుతోంది. ఈ కేసులో వరుసగా సినీ సెలబ్రిట్రీలు, సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు నవుతున్నాయి. సోషల్‌ మీడియాలో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసిన సినీ,టీవీ సెలబ్రిటీలు.. ఇన్‌ప్లూయేన్సర్లపై పోలీసులు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే.

విచారణకు విష్ణుప్రియ

ఈ వ్యవహారంలో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదైంది. బెట్టింగ్‌యాప్స్‌ ప్రమోషన్స్‌ వల్ల ప్రజలు ప్రభావితమై బెట్టింగ్‌ ఊబిలోకి దిగుతున్నారని, దానికి ఎంతోమంది అమాకప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తూ వినయ్‌ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ఇప్పికే కొంతమందిని యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేసి వారికి నోటీసులు ఇచ్చారు. ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతుండగా.. గురువారం విష్ణుప్రియా పంజాగుట్ట పోలీసుల స్టేషన్‌కు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

విజయ్, రానా, మంచు లక్మిలపై కేసు

ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం బుల్లితెన నటీనటులు, ఇన్‌ఫ్లూయేన్సర్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ స్టార్స్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హీరోలు రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌, ప్రణిత, యాంకర్‌ శ్యామలపై గురువారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వారితో పాటు మరికొందరు నటీనటుల పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు. మొత్తంగా 25 మంది బెట్టింగ్‌ యాప్‌ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. నటి అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమ్రత చౌదరి, నాయని పావని, పద్మావతి, నేహా పతాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ సహా 25 మందిపై మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్టు సమాచారం.

Exit mobile version
Skip to toolbar