Site icon Prime9

Bandla Ganesh Sensational Tweet: దిల్‌ రాజు ప్రెస్‌మీట్‌.. అదే టైంలో బండ్ల గణేష్‌ సంచలన ట్వీట్‌!

Bandla Ganesh Sensational Tweet While Dil Raju Press Meet: నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే విషయం తెలిసిందే. సినిమాలు, రాజకీయాలపై తరచూ కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ కూడా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బర్నింగ్‌ ఇష్యూలపై వ్యంగ్యంగా, సెటైరికల్‌గా కామెంట్స్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా దిల్‌ రాజు ప్రెస్‌ తర్వాత బండ్ల గణేష్‌ ఓ ట్వీట్‌ వదిలారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఎవరి పేరు ప్రస్తావించకుండానే.. కమల్‌ హాసన్‌.. అంటూ సెటైరికల్‌గా కామెంట్స్‌ చేశాడు.

 

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ల వివాదం కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్‌ ప్రెస్‌ నోట్ రిలీజ్ అనంతరం.. ఆదివారం నిర్మాత అల్లు అరవింద్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ నలుగురు అంటూ థియేటర్ల బంద్‌ వివాదంలోని తనని లాగుతున్నారని, ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం చేశారు. అంతేకాదు తనకు తెలంగాణ ఒక్క థియేటర్‌ కూడా లేదన్నారు. ఏపీలో 15 ఉన్నాయని, అవి కూడా లీజుకు తీసుకున్నవని పేర్కొన్నారు.

 

ఇక అల్లు అరవింద్‌ ప్రెస్‌ మీట్‌ తర్వాత ఇవాళ (సోమవారం) నిర్మాత దిల్‌ రాజు ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఆయన కూడా ఆ నలుగురు అంటూ వ్యక్తిగత దాడి చేస్తున్నారని, తనకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. అయితే సరిగ్గా దిల్‌ రాజు ప్రెస్‌మీట్‌ జరుగుతున్న సమయంలోనే నిర్మాత బండ్ల గణేష్‌ ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఆస్కార్‌ నటులు, కమల్‌ హాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.

 

థియేటర్ల బంద్‌ వివాదంతో ఓ వైపు రగడ జరుగుతుంటే.. మరోవైపు బండ్ల గణేష్‌ చేసిన ఈ ట్వీట్ దుమారం రేపుతోంది. ఇక్కడ ఆయన ఎవరి పేరు ప్రస్తావించలేదు.. కానీ, నిర్మాత ప్రెస్‌ మీట్‌ సమయంలోనే ఈ ట్వీట్‌ చేయడం వెనక అంతర్యం ఏంటని సందేహిస్తున్నారు. అల్లు అరవింద్‌, దిల్‌ రాజును ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్‌ చేసి ఉంటారని కొందరు నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే థియేటర్ల అంశం ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో బండ్ల గణేష్‌ చేసిన ఈ ట్వీట్‌ ఎలాంటి వివాదానికి దారి తీస్తుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

Exit mobile version
Skip to toolbar