Prime9

Babil Khan Video: బాలీవుడ్‌ చాలా చెడ్డది – అనన్య, అర్జున్‌ కపూర్‌ లాంటి వారు.. కన్నీరు పెట్టుకున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ కుమారుడు

Babil Khan Called Bolywood is screwed: బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ అందించారు. తనదైన నటనతో లెజండరీ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన 2020లో క్యాన్సర్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అనంతరం ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడు బాబిల్‌ ఖాన్‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఖాలా’ హిందీలో తెరంగేట్రం చేసిన బాబిల్‌ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు.

 

ఇటీవలె ‘లాగ్‌ అవుట్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫలితాలతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాబిల్‌ ఓ షాకింగ్‌ వీడియోలు షేర్‌ చేశాడు. ఇందులో బాబిల్‌ ఏడుస్తూ బాలీవుడ్‌ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని, అర్జున్‌ కపూర్‌, అనన్య పాండే, షనయా కపూర్‌ వంటి నటీనటుల బండారం బయటపెట్టాడు. ఏడుస్తూ వరుసగా సెల్ఫీ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పోస్ట్ చేశాడు. అయితే కాసేపటికే అవి డిలీట్‌ చేశాడు.

 

అంతేకాదు తన అకౌంట్‌ని కూడా డి యాక్టివేట్‌ చేశాడు. అప్పటికే పలు మీడియా సంస్థలు బాబిల్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేస్తూ వరుస కథనాల ప్రచురిస్తోంది. ఇంతకీ బాబిల్‌ బాలీవుడ్‌ గురించి ఏమన్నాడంటే.. “ఇవాళ మీ అందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బాలీవుడ్‌ పని చేయడానికి మచంఇ ప్రదేశం కాదు. ఇక్కడ నటీనటులు అసలు మంచివారు కాదు. అనన్య పాండే, అర్జున్‌ కపూర్‌ క్రూరమైన వారు. ఈ ఇండస్ట్రీ ఎంతో అమర్యాదకరంగా వ్యవహరిస్తుంది. ఇప్పటివరకూ నేను చూసిన వాటిలో నకిలీ పరిశ్రమ ఇదే.

 

ఇక్కడి వారు అస్సలు మంచివారు కాదు. చాలా ప్రమాదకరమైన వారు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వారు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నా. బాలీవుడ్‌ చాలా చెడ్డది. అనన్య, అర్జున్‌ కపూర్‌, షనయా కపూర్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, ఆదర్శ్‌ గౌరవ్‌, అజిత్ సింగి వారు ఎంతో మంది పరిశ్రమకు సంబంధం లేనివాళ్లు ఉన్నారు” అంటూ ఏడుస్తూ వీడియో షేర్‌ చేశాడు. దీనిపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. బాబిల్‌కి ఏమైంది, ఆయన మెంటల్‌ హెల్త్‌ బాగానే ఉందా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పోస్ట్‌ చేసన కాసేపటికి ఈ వీడియోలను డిలీట్‌ చేయడమే కాకుండ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ డియాక్టివేట్‌ చేయడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar