Ayan Mukerji first Post on War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. గతంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించి వార్ చిత్రానికి ఇది సీక్వెల్. బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం కావడంతో మూవీపై మంచి బజ్ నెలకొంది. ఇందులో తారక్ యాక్టింగ్, లుక్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసుకునేందుకు తెగ ఆసక్తిగా ఉన్న ఫ్యాన్స్‌కి ఆయన బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చారు. మే 20న విడుదలైన టీజర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో ఎన్టీఆర్ ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో మరింత పవర్ఫుల్, స్టైలిష్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ని కనువిందు చేశాడు. టీజర్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మరో ట్రీట్ ఇచ్చాడు. తాజాగా వార్ 2 సెట్‌లోని ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లకు సీన్‌ను వివరిస్తున్న షాట్స్‌కి సంబంధించి ఫోటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం అతడి పోస్ట్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోల నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ పోస్ట్ అయాన్ ఇలా రాసుకొచ్చాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మరికొన్ని వారాల్లో మా చిత్రం మీ ముందుకు వస్తుంది. ఈ క్రమంలో మా సినిమా గురించి విశేషాలను మీతో షేర్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అనిపిస్తోంది. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను ఈ సినిమా చూసేందుకు ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నప్పటికీ.. వార్ 2 గురించి నేను బాగా స్ఫూర్తి పొందిన అంశాలను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీలోని ప్రధానాంశం చాలా శక్తివంతమైనది. మొదటి సారి స్క్రిప్ట్ విన్నప్పుడు నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. దీనిని రూపొందించడమంటే సవాలుతో కూడుకున్నదని అర్థమైంది.
దాని గురించి చెప్పడానికి ఇది సమయం కాదు. అందుకే వార్ 2 స్క్రిప్ట్ తర్వాత నేను ఫీల్ అయ్యింది కొన్ని మాటల్లో మీకు చెప్తాను. ఈ కథను గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నా. ముఖ్యంగా నా స్నేహితులు కియారా ఇందులో తన అద్భుతమైన నటనతో సినిమాకు మరింత వన్నే తెచ్చారు. ఇక ఇద్దరు దిగ్గజాలతో (హృతిక్-ఎన్టీఆర్) కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ నిర్మాత ఆదిత్య చోప్రా నాయకత్వం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. దిగ్గజాలలైన హృతిక్-ఎన్టీఆర్‌లను దర్శకత్వం చేసే అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్న. వార్ 2లో ఈ ఇద్దరు దిగ్గజాలు సృష్టించిన మాయాజాలాన్ని మన ప్రేక్షకులు అనుభవించే వరకు వేచి ఉండలేకపోతున్నా. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను పంచుకుంటాను. ఆగష్టు 14న (నా పుట్టిన రోజు సందర్భంగా) ఓ అద్భుతంతో మీ ముందుకు వస్తున్నాము” అంటూ ఆయన రాసుకొచ్చారు.