Site icon Prime9

#AvatarTheWayOfWater: విజువల్ వండర్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” ట్రైలర్

avatar the way of water movie trailer

avatar the way of water movie trailer

#AvatarTheWayOfWater: జేమ్స్ కామెరూన్ ఈయన చిత్రాలు వస్తున్నాయంటేనే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అవతార్ ఈ చిత్రం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విజువల్ వండర్ గా 13ఏళ్ల క్రితం తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్దు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు నెలకొల్పింది. ఇక ఈ మూవీ ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

కాగా ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ అయిన అవతార్-2కోసం వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన “అవతార్ 2” మూవీని కూడా జేమ్స్ కేమరూన్ తెరకెక్కించనున్నారు. కాగా తాజాగా “అవతార్ ది వే ఆఫ్ వాటర్”ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగానే ఆ అద్భుత ప్రపంచం ఎక్కడైనా ఉంటే బాగుండు ఉన్నంత అందంగా విజువల్ వండర్ గా తెరకెక్కించారు జేమ్స్ కామెరూన్. ఈ మూవీలో పండోరలో కొత్త నావి కాలనీని చూపించారు. దీనిలో కూడా జేక్ సుల్లీ మరియు నేయిత్రి కుటుంబమే కీలక పాత్రలుగా నీటి అడుగున ప్రాంతంలో ఈ కథ అంతా జరుగుతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: హాలీవుడ్ సినిమాను తలదన్నెలా పటాన్ టీజర్

Exit mobile version