Avatar 2 OTT Release: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ ‘అవతార్ 2’(అవతార్-ది వే ఆఫ్ వాటర్). గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
2009 లో పండోరా గ్రహంపై అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ..13 ఏళ్ల తర్వాత అవతార్ 2 ను తెరకెక్కించారు.
ఈ మూవీలో సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు తెలియ జేశారు.
అయితే, ఇన్నాళ్లు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ చిత్రం.. ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది.
మార్చి 28 న ఓటీటీలో(Avatar 2 OTT Release)
ఈ విజువల్ వండర్ మార్చి 28 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అవతార్ టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ట్వీట్ చేసింది.
ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి .. అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అవతార్ లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్.
దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’ పేరుతో అవతార్-2 ను తెరకెక్కించాడు.
పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు.
ఊహాశక్తితో తెరపై సృష్టి
మోషన్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందిన సినిమా ఇది. సామ్ వర్తింగ్టన్ కథానాయకుడిగా కనిపిస్తాడు. తండ్రిగా, నాయకుడిగా చక్కటి భావోద్వేగాల్ని పలికించాడు.
పోరాట సన్నివేశాల్లోనూ అలరించాడు. స్టీఫెన్ లాంగ్ భూమి నుంచి వచ్చిన శత్రువుగా, పండోరా గ్రహం రాక్షస సైన్యంగా భావించే సమూహానికి అధిపతిగా కనిపిస్తాడు.
జో సల్దానా, సిగోర్నీ వీవర్, జోయల్, క్లిఫ్‌తోపాటు, కేట్ విన్‌స్లెట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతిక విభాగాల్లో ప్రతి డిపార్ట్ మెంట్ అద్భుతమైన పనితీరు కనబరిచింది. సంగీతం, ఛాయాగ్రహణంతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన బృందంతో కలిసి అందించిన స్క్రీన్‌ప్లే, మలిచిన పాత్రలు ఒక ఎత్తయితే.. ఆయన తనదైన ఊహాశక్తితో తెరపై సృష్టించిన పండోరా గ్రహం మరో అద్భుతం.
నీటి ప్రపంచాన్ని ఇంత అందంగా మరెవ్వరూ ఆవిష్కరించలేరేమో అనేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఈ చిత్ర నిర్మాణం మరో స్థాయిలో ఉంది.