Site icon Prime9

Avatar 2 : అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డు బ్రేక్ చేసిన అవతార్ 2 … ఏకంగా అన్ని వేల థియేటర్స్ లో రిలీజ్

avatar-2-break-avengers-end-game-record-in-theatres-count

avatar-2-break-avengers-end-game-record-in-theatres-count

Avatar 2 : దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ” అవతార్ ” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009 డిసెంబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా 20 వేల కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2009 నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డును ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది అంటేనే మనం గమనించవచ్చు. ఇక అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ సైతం ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు రిలీజ్ కానున్న అవతార్‌ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రం మరెన్ని రేకార్డులను నెలకొల్పుతుందో అని ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కామెరూన్ , ఇంకా సినిమాలో ఎన్ని అద్భుతాలను చూపిస్తారో అని అంతా క్యూరియాస్ గా ఉన్నారు. ముఖ్యంగా విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పండోరా లోని సముద్రాలను హైలైట్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నీటిలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అందరికీ ఓ రేంజ్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాను రికార్డు స్థాయి భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను ఆయా దేశాల ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక సినిమా రిలీజ్ కి ఒక రోజు మాత్రమే ఉండడంతో అవతార్-2 మేనియాతో ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఈ క్రమంలో అవతార్-2కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయనే విషయంపై సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు.

ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కానుందంటే ?

కాగా, ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 52 వేల స్క్రీన్స్‌లలో రిలీజ్‌ కానుందని సమాచారం అందుతుంది. దీంతో ఈ సినిమా అవెంజర్స్ ది ఎండ్ గేమ్ మూవీని రికార్డును బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక విడుదల తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగ రాస్తుందో చూడాలి.

Exit mobile version