Site icon Prime9

Miss Shetty Mr Polishetty : స్వీటీ ఈజ్ బ్యాక్.. “మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి” తో వచ్చేస్తున్న అనుష్క

anushka new movie titled as miss shetty mr polishetty

anushka new movie titled as miss shetty mr polishetty

Miss Shetty Mr Polishetty :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ కానుంది. బాహుబలి వంటి భారీ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాహ కొంచెం గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత సవవీటి నటిస్తున్న గురించి ఇటీవలే ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. అనుష్కకి జోడీగా వరుస హిట్లు అందుకొని ఫామ్ లో ఉన్న నవీన్‌ పొలిశెట్టి చేస్తుండటం మరింత కిక్ ఇచ్చే విషయం అని చెప్పాలి. దీంతో సినిమా ప్రకటించినప్పట్నుంచే దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా అనుష్క ఫ్యాన్స్ కి మరో స్వీట్ న్యూస్ ఇచ్చింది మూవీ టీం.

పేర్లు కలిసేలా క్రేజీ టైటిల్..

మహేష్‌బాబు అనే నూతన దర్శకుడు డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రానికి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇందులో అనుష్క ఓ పుస్తకం పట్టుకుని తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయి ఏదో ఆలోచిస్తుంది.. ఆ పుస్తకంపై హ్యాప్పీ సింగిల్ అని రాశి ఉంది. మరోవైపు గోడపై కూర్చొని నవీన్‌ పొలిశెట్టి తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయారు.. అతని టీ షర్ట్ పై రెడీ టూ మింగిల్ అని రాశి ఉంది. అయితే అనుష్క లండన్‌లో ఉండగా, నవీన్‌ హైదరాబాద్‌లో ఉన్నట్లు ఫోటో చూస్తే అర్దం అవుతుంది. ఉండటం విశేషం.

అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. టైటిల్ ని పెట్టడం పట్ల అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. నవీన్.. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటిస్తున్నారు. అనుష్క కెరీర్‌లో 48వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌గా దర్శకుడు పి.మహేష్ తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోండగా, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకుంటున్నారు. అనుష్క కొంచెం బరువు పెరగడం.. మళ్ళీ సలీం అయ్యేందుకు కొంచెం టైమ్ తీసుకోవడంతో ఇన్నాళ్ళూ సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీతో అనుష్క మంచి హిట్ సాధించి బ్యాక్ టు ఫామ్ అవ్వాలని ఆమె అభిమనులంతా కోరుకుంటున్నారు. ముఖ్యమగా సోషల్ మీడియా లో ఆ పోస్టర్ ని షేర్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అందుకు కోటేషన్లుగా “గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అని” .. “ఉపవాసం ఉన్న పులి ఈసారి వేటాడటం పక్కా అని రాసుకొస్తున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version