Site icon Prime9

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశా.. యాంకర్ శ్యామల

Anchor Shyamala Reaction On Betting Apps After Enquiry: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమెను పోలీసులు సుమారు 3 గంటల పాటు విచారించారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌లో లావాదేవీలతో పాటు పలు రకాల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడారు. చట్టాలపై నమ్మకం ఉందని, విచారణకు సహరిస్తానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశానని, భవిష్యత్‌లో ఇంకా ఎలాంటి తప్పు చేయనని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన కేసు కోర్టు పరిధిలో ఉందని, అందుకే మాట్లాడడం సరికాదని వివరించింది.

 

కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యాంకర్ శ్యామలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం విచారణ ఉంటుందని నోటీసులు అందజేశారు. అయితే ఆమె విచారణకు రాకుండా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ అందజేసింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని, నోటీసులు అందజేసి విచారణ చేయాలని పంజాగుట్ట పోలీసులను కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇందులో భాగంగానే ఇవాళ పోలీసుల విచారణకు హాజరుకావాలని కోర్టు సూచించగా.. ఆమె ఉదయమే కోర్టుకు చేరుకొని విచారణకు హాజరైంది. శ్యామల.. ‘ఆంధ్రా 365’ బెట్టింగ్ యాప్‌ కోసం ప్రమోట్ చేసింది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11మంది పై నమోదైంది.

 

ఇదిలా ఉండగా, బెట్టింగ్ యాప్‌ కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్‌లో నమోదైన కేసులో యాప్‌ల యజమానులను సైతం పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. నిందితుల జాబితాలో మొత్తం 19 యాప్‌ల యజమానులు ఉన్నారు. ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో సహా 25 మందిపై కేసు నమోదు చేశారు.

Exit mobile version
Skip to toolbar