Site icon Prime9

Baby Movie : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి “బేబీ” మూవీ టీజర్ రిలీజ్.. మా కంటే ఎవరూ గట్టిగా కొట్టలేరు అంటూ !

anand devarakonda baby movie trailer released

anand devarakonda baby movie trailer released

Baby Movie : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తనదైన శైలిలో దూసుకుపోతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ నటిస్తున్న చిత్రం “బేబీ”. ఇందులో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా .. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. 2020లో కలర్ ఫోటోతో ప్రేక్షకులను మెప్పించిన సాయి రాజేష్.. ఈ సినిమాతో డైరెక్టర్ గా మ్యాజిక్ చేయబోతున్నారని ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. కాగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఆడియన్స్ కి మంచి గిఫ్ట్ ఇచ్చింది.

కాగా తాజాగా ఈ సినిమా (Baby Movie) ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఏ ట్రైలర్ ని గమనిస్తే..  కథ మొత్తం వైష్ణవి చైతన్య చుట్టూ తిరగనుందని అర్ధం అవుతుంది.  స్కూల్ లో ఒక అబ్బాయిని ప్రేమించిన హీరోయిన్.. కాలేజీకి వెళ్ళాక అక్కడ మరో వ్యక్తి కూడా తనని ప్రేమిస్తాడు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగింది అనేది కథాంశంగా తెరకెక్కుతుంది. ఇక ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అందర్నీ లవ్ ఫెయిల్యూర్ లను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. “ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదొక సిగ్నల్ ఇస్తాడు.

మరి నీలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే”అనే డైలాగ్.. “తిరిగి కొట్టేంత బలం లేదనేగారా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు” అన్న రెండు డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. జూలై 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. చూడాలి మరి ఈ మూవీతో ఈ యంగ్ జంట ఏం చేయబోతున్నారో అని..

 

Exit mobile version