Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో ఏళ్లుగా మహేష్ అభిమానుల కల ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తరువాత రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ జక్కన్న.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. మేకోవర్ మొత్తం మార్చేశాడు. ఈ మధ్యనే SSMB29 పట్టాలెక్కింది. మహేష్ దగ్గరనుంచి రాజమౌళి పాస్ పోర్ట్ ను తీసుకున్నట్లు ఒక పోస్ట్ పెట్టడం.. అది అప్పట్లో వైరల్ గా మారడం అందరికీ తెల్సిందే. జక్కన్న సినిమా అంటే ఎన్నేళ్లు పడుతుందో చెప్పడం కష్టం. సినిమా పూర్తి అయ్యేవరకు కదలడానికి కూడా వీలు ఉండదు.
ఇంకోపక్క మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం విదితమే. కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లందే ఆయనకు జీవించినట్లే అనిపించదు. పిల్లలకు సెలవులు ఉండడం ఆలస్యం.. ఏదొక దేశానికి వెకేషన్ కు వెళ్ళిపోతూ ఉంటాడు. రాజమౌళి పాస్ పోర్ట్ తీసేసుకోవడంతో ఇక ఇప్పటివరకు చేసిన వెకేషన్స్ బంద్. సినిమా ఫినిష్ అయ్యేవరకు ఎక్కడికి కదిలేది లేదని.. మహేష్ ను లాక్ చేశాడు.
ఇక ఆ ఒక్క పోస్ట్ ఒక పెను సంచలానాన్నే సృష్టించింది. మహేష్ ను లాక్ చేసిన జక్కన్న. ఇక ఇప్పుడప్పుడే పాస్ పోర్ట్ చేతికి రాదని, సీతూ పాప అలిగినట్లు, బుంగమూతిపెట్టినట్లు ఇలా రకరకాలుగా మీమ్స్ వేశారు. అయితే తాజాగా మహేష్ చేతికి పాస్ పోర్ట్ చిక్కింది. ఎయిర్ పోర్ట్ లో మహేష్ సీతూ పాపతో కనిపించాడు. వెళ్తూ వెళ్తూ తన పాస్ పోర్ట్ తన చేతికి వచ్చిందని చూపించాడు.
పాస్ పోర్ట్ చేతికి రావాడంతో మహేష్ ఫుల్ హ్యాపీలో మునిగిపోయాడు. అందుతున్న సమాచారం ప్రకారం SSMB29 మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతోనే జక్కన్న కొద్దిగా రెస్ట్ ఇచ్చాడని, అందుకే మహేష్ కు పాస్ పోర్ట్ ఇచ్చాడని అంటున్నారు. మరి మహేష్ ఈ రెస్ట్ మోడ్ లో ఎక్కడెక్కడికి వెళ్లి వస్తాడో చూడాలి.