Ram Charan – Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనలకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే చరణ్, ఉపాసన చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు అనే విషయం తెలిసిందే. అయితే పెళ్లై పదేళ్లు అవుతున్నా.. చరణ్ దంపతులు ఎలాంటి శుభవార్తా చెప్పకపోవడంతో ‘పిల్లలెప్పుడు’ అంటూ అనేక సందర్భాల్లో ఉపాసనకు ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే ఇటీవలే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు.
ఈ మేరకు ఆ ట్వీట్ లో .. ‘హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్‌లు తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో.. మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ శుభవార్తని రామ్ చరణ్ మొదటిగా తన స్నేహితుడు ఎన్టీఆర్ తో షేర్ చేసుకున్నట్లు తాజా హాలీవుడ్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
అయితే రామ్ చరణ్ ఇటీవల అమెరికన్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ టాక్ షోలో రామ్ చరణ్ తో పాటు అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ కూడా పాల్గొంది. ఇక షోలో ఆమె మాట్లాడుతూ.. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె రామ్ చరణ్‌తో.. ‘మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా, అందుకోసం మీతో ప్రపంచంలో ఎక్కడికి రమ్మన్నా వస్తాను’ అంటూ వ్యాఖ్యానించింది.
మీరు ఇక్కడికి రావాలని ఉపాసన రిక్వెస్ట్ (Ram Charan – Upasana)..
ఇక ఈ వ్యాఖ్యల పై ఇటీవల ఉపాసన స్పందించింది. ‘డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మిమ్మల్ని కలవడానికి నేను ఎదురు చూస్తున్నా. మా ఫస్ట్ బేబీని డెలివరీ చేయడానికి మీరు అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వచ్చుగా’ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. తాజాగా ఉపాసన రిక్వెస్ట్ కి డాక్టర్ జెన్నిఫర్ బదులిచ్చింది. “అందుకు నాకు అంగీకారమే” అంటూ కామెంట్ చేసింది. దీంతో మెగా వారసుడు ఇండియన్ ఫేమస్ హాస్పిటల్ అపోలోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ చేతులు మీదగా ఈ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా మరోవైపు రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో #rc 15 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుండగా శ్రీకాంత్, అంజలి , సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించనుండగా.. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే చార్మినార్, కొండారెడ్డి బురుజు లాంటి ముఖ్యమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకోగా.. అందుకు సంబంధించి ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/