Prime9

Allu Arjun: ఊహించని డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ – ఆయనెవరో తెలిస్తే షాక్‌ అవుతారు

Allu Arjun Team Up With This Malayalam Director: తెలుగు స్టార్‌ హీరోలు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రూటే సపరేట్‌. మిగతా హీరోలతో స్టైల్‌లోనూ అందరికంటే భిన్నంగా ఉండాలనుకుంటాడు. తన సినిమాల్లోనూ ప్రయోగం చేసేందుకు ఆసక్తి చేస్తుంటాడు. అందుకే సినిమా సినిమాకు అందులో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. అందుకే ఇప్పటి జనరేషన్‌లో హీరోల్లో ఆయన ఫస్ట్‌ నేషనల్‌ అవార్డు హీరో అయ్యాడు. ఇండస్ట్రీలో బన్నీకి రూటే సపరేట్‌ అన్నట్టుగా ఉంటాడు.

 

ఇక పుష్ప 1, పుష్ప 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ సినిమాలపై ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడు.. ఆల్మ్‌స్ట్‌ కన్‌ఫాం అయ్యిందనే వార్తలు వస్తుండగా.. తమిళ హిట్‌ డైరెక్టర్‌ అట్లీతో కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించాడు. దీంతో త్రివిక్రమ్‌తో ఇక సినిమా లేనట్లే అని దాదాపు ఖారారైంది. అట్లీ తర్వాత నెక్ట్స్‌ డైరెక్టర్‌ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ లిస్ట్‌ ప్రశాంత్‌ నీల్‌ ఉన్నారు. ఆయన తప్పకుండ ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడనే టాక్‌ ఉంది. కానీ, బన్నీ మాత్రం అందరికి షాకిస్తూ ఎవరూ ఊహించని డైరెక్టర్‌కి ఓకే చెప్పాడట.

 

ప్రస్తుతం ఈ వార్త సినీవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కనీసం ఆ డైరెక్టర్‌ ఎవరో కూడా ఊహించలేరు. ఇందుకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఆ డైరెక్టర్‌ కథ చెప్పగా.. బన్నీ ఒకే చేశాడట. అట్లీ తర్వాత అతడితో సినిమా చేసే అవకాశం ఉందట. ఇంతకీ అతడేవరంటే. మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్‌ జోసేఫ్‌ (Basil Joseph). అతడితో సినిమా దాదాపు ఖారరైపోయిందట. మలయాళంలో డైరెక్టర్‌గానే కాకుండ నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు.

 

‘జయ జయ జయ జయహే’, ‘సూక్ష్మదర్శిని’, ‘పోన్‌ మాన్‌’ వంటి సినిమాలతో అతడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. ఈ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన అతడు ఇప్పుడ ఏకంగా అల్లు అర్జున్‌నే లైన్‌లో పెట్టాడు. బన్నీకి మలయాళంలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అదే క్రేజ్‌తో బాసిల్‌ జోసెఫ్‌కి బన్నీ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆ కథేంటి, బన్నీ ఇంప్రెస్‌ అయ్యేంతగా అందులో ఏముందని ఇప్పుడు ఆసక్తిని పెంచుతుంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version
Skip to toolbar