Site icon Prime9

Allu Arjun: కొరియన్ అమ్మాయిలతో బన్నీ డ్యాన్స్

Tollywood: తన మొట్టమొదటి మ్యూజిక్ కమ్ డ్యాన్స్ వీడియోలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దక్షిణ కొరియా అమ్మాయి బృందం TRI.BE తో కలిసి ఉన్నాడు. ఈ వీడియోను ఆవిష్కరించిన అల్లు అర్జున్, ఈ వీడియోలో భాగమైన ప్రతి క్షణం తనకు చాలా ఇష్టమని, తన అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

‘మేము ఆగము’ పాటను గాయకుడు అర్మాన్ మాలిక్ పాడగా కొలిన్ డి కున్హా వీడియోకి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ తనదైన స్టైల్లో కూల్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించాడు. ఇది భారతదేశంలో కోకా కోలాతో అల్లు అర్జున్ సహకారాన్ని సూచిస్తుంది. బన్నీ ఇటీవలే ఎండార్స్‌మెంట్స్‌ పై సంతకం చేసాడు. గత నెలలో టెలివిజన్ పలు వాణిజ్య ప్రకటనల షూటింగ్ లో పాల్గొన్నాడు.

అల్లు అర్జున్ తాజాగా న్యూయార్క్ లో యాన్యువల్ ఇండియన్ డే పెరేడ్ లో పాల్గొని అభిమానులను అలరించాడు. అతను నటించే పుష్ప 2 చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభవుతుంది.

Exit mobile version