Site icon Prime9

Sooryavanshi: హయ్యెస్ట్ బాలీవుడ్ ఓపెనింగ్ మూవీ సూర్యవంశీ

Bollywood: కోవిడ్ -19 మహమ్మారిభారతీయ సినిమా పై గట్టి ప్రభావమే చూపింది. ఇటీవల కాలంలో KGF చాప్టర్ 2 మరియు RRR పెద్ద వాణిజ్య విజయాలుగా అవతరించడంతో సౌత్ సినిమాలు నార్త్ బెల్ట్‌లోకి ప్రవేశించాయి. కానీ, బాలీవుడ్ మొత్తం కష్టాల్లో పడినట్లే. భూల్ భులయ్యా 2 మరియు జగ్‌జగ్ జీయో చిత్రాలు మాత్రం కొంచెం ఊరట నిచ్చాయి. మరొక విశేషమేమిటంటే అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ (2021) ఇప్పటికీ బాలీవుడ్‌లో అత్యధిక వారాంతపు ఓపెనింగ్స్ సాధించిన ఏకైక చిత్రం అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పారు.

ట్విట్టర్ లో, తరణ్ ఆదర్శ్ సూర్యవంశీ కలెక్షన్లను ప్రస్తావించి ఇలా వ్రాశారు, “శుక్ర రూ.26.29 కోట్లు, శనివారం రూ.23.85 కోట్లు, ఆదివారం రూ. 26.94 కోట్లు #Sooryavanshi నవంబర్ 2021లో విడుదలైన మొదటి బిగ్గీ – ఇప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డును కలిగి ఉంది. #BO [#మహారాష్ట్రలో విడుదలైనప్పుడు 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ] (sic). అక్షయ్ కుమార్ మరియు కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగించింది. కోవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇది అత్యధిక బాలీవుడ్ ఓపెనింగ్.

2022 బాలీవుడ్‌లో ఫ్లాప్ చిత్రాల సంవత్సరంగా నిలిచింది. సామ్రాట్ పృథ్వీరాజ్, అనేక్, ఢాకడ్, జయేష్ భాయ్ జోర్దార్, హీరోపంతి 2, రన్‌వే 34, జెర్సీ, ఎటాక్, రాష్ట్ర కవచ్ ఓం, బచ్చన్ పాండే, ఖుదా హాఫీజ్ 2, బదాయి దో, ఝు , హిట్: ది ఫస్ట్ కేస్, శభాష్ మిథు, ఏక్ విలన్ రిటర్న్స్ మరియు షంషేరా తదితర చిత్రాలు బాక్పాఫీసు వద్ద చతికిల పడ్డాయి. 2022లో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ యొక్క రక్షా బంధన్ ఈ రెండు సినిమాలు ఆగస్ట్ 11న రిలీజ్ అవుతున్నాయి.

Exit mobile version