Akkineni Akhil: మిగతా హీరోలతో పోలిస్తే అక్కినేని హీరోలు కొన్ని విషయాల్లో వెనుకనే ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు కోసం హీరోలు పాకులాడుతున్నారు కానీ, అక్కినేని హీరోలు మాత్రం చాలా నిదానంగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యనే తండేల్ సినిమాతో అక్కినేని నాగచైతన్య పాన్ ఇండియా ఖాతా ఓపెన్ చేశాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై సరసన సాయిపల్లవి నటించింది. ఫిబ్రవరి 7 న రిలీజ్ అయిన తండేల్.. దాదాపు రూ. 139 కోట్లు వసూలు చేసి చైతూని 100 కోట్ల క్లబ్ లో నిలబెట్టింది.
ఎట్టకేలకు అన్నగారు ఖాతా ఓపెన్ చేసేశారు. ఇక ఇప్పుడు అయ్యగారు వంతు. అదేనండీ అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఒక మంచి హిట్ అందుకున్న అఖిల్.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు అనుకున్నారు అందరూ. కానీ, రెండేళ్లు కష్టపడి ఏజెంట్ సినిమాతో వచ్చిన అయ్యగారికి భారీ డిజాస్టర్ దక్కింది. అసలు ముందు అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. చివర్లో క్యాన్సిల్ అవ్వడంతో కేవలం తెలుగులోనే రిలీజ్ చేశారు.
ఇక ఏజెంట్ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో అఖిల్ కృంగిపోలేదు. కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చాలా కథలను విని.. విని చివరికి అఖిల్ ఒక కథను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమాతో కిరణ్ అబ్బవరంకు ఒక మంచి హిట్ ను అందించిన డైరెక్టర్ నందు.. ఇప్పుడు అఖిల్ కోసం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి కథతో రాబోతున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ కథ మొదట సాహూ గారపాటి వద్దకు వచ్చిందని, విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ కావడంతో అక్కినేని నాగార్జున కావాలనే ఆ కథను అఖిల్ కోసం అడిగి తీసుకొని.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 14 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు పెట్టింది పేరు అక్కినేని ఫ్యామిలీ.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, నాగచైతన్య.. వీరందరికీ హిట్స్ ఇచ్చింది పల్లెటూరి కథలే. అందుకే అఖిల్ కు కూడా ఈ సినిమా మంచి హిట్ ను ఇస్తుందని నాగ్ నమ్మకం పెట్టుకున్నాడని తెలుస్తోంది. అది కాకుండా విన్నర్ భాగ్యము విష్ణుకథ సినిమాలో నందు తిరుపతిని ఎంతోఆ అందంగా చూపించాడు. ఇక ఇప్పుడు చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో అఖిల్ కథ నడుస్తుందని టాక్. మరి ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ తో అయ్యగారు హిట్ కొట్టేనా.. ? అంటే చూడాలి.