Site icon Prime9

Akhil’s ‘Lenin’ Title Glimpse: ఊరమాస్ అవతారంలో అయ్యగారు.. ఇది కదా కావాల్సింది!

LENIN - TITLE GLIMPSE

LENIN - TITLE GLIMPSE

Akkineni Akhil’s ‘Lenin’ Movie Title Glimpse Out Now: అక్కినేని నాగార్జున..  ఎలాగైనా తన ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తండేల్ సినిమాతో పెద్ద కొడుకు నాగచైతన్య పాన్ ఇండియా హీరోగా మొదటి మెట్టు ఎక్కాడు. ఇక ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ వంతు వచ్చింది. మొదటి సినిమా అఖిల్ నుంచి అయ్యగారు మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కు మొదటి హిట్ పడింది. దీని తరువాత పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్ ను మొదలుపెట్టాడు. రెండేళ్లు కష్టపడి బాడీ పెంచి  ఏజెంట్ కోసం శ్రమించాడు. కానీ, ఈ సినిమా భారీ పరాజయాన్ని అందించింది. ఎలాగైనా ఈసారి గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని అఖిల్ మంచి కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా కొడుకును నిలబెట్టడానికి పూనుకొని అఖిల్ 6 ను మొదలుపెట్టారు.

 

అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్6 ను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో.. అఖిల్ 6 టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ అదిరిపోయింది. ఊర మాస్ అవతార్ లో అఖిల్ కనిపించాడు. ఇక ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొన్ని సిద్ధాంతాలు ఉన్న క్యారెక్టర్ లా కనిపిస్తుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తోంది.

 

” గతాన్ని తరమడానికి పోతా.. మా నాయన నాకు ఒక మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా..పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటది. ఆ పేరు ఎట్టా నిలబడాలి అంటే” అంటూ బేస్ వాయిస్ తో అఖిల్ చెప్తున్నా డైలాగ్ తో అతని ఎంట్రీ చూపించారు. ఇక అఖిల్ లుక్, డైలాగ్ కు.. థమన్ మ్యూజిక్ వేరే  లెవెల్ అని చెప్పాలి.

 

గ్లింప్స్ ను బట్టి.. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడవనుంది తెలుస్తోంది. పల్లెటూరి పిల్లగా శ్రీలీల కనిపించింది.  మొదటి నుంచి ప్రేమ కన్నా మరే యుద్ధం పెద్దది కాదు అని చెప్పుకొచ్చారు. ఇక  అఖిల్ ఈసారి ప్రేమ కోసం యుద్ధం చేయబోతున్నాడని తెలుస్తోంది. అఖిల్ ను ఇప్పటివరకు స్టైలిష్ లుక్ లోనే చూసారు. కానీ, మొదటిసారి ఊర మాస్ లుక్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అయ్యగారి నుంచి ఇలాంటి సినిమానే కదా కోరుకున్నది అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ ను అందుకుంటాడా లేదా చూడాలి.

 

LENIN - Title Glimpse | Akkineni Akhil | Sreeleela | Murali Kishor | Akkineni Nagarjuna | Naga Vamsi

Exit mobile version
Skip to toolbar