Site icon Prime9

Ajith: హీరో అజిత్‌కి తప్పిన పెను ప్రమాదం

Ajith Kumar Car Crash in Racing: తమిళ స్టార్‌ హీరో అజిత్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్‌లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన స్టైల్‌, మ్యానరిజం, సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన నటుడు మాత్రమే కాదు, కారు రేసర్‌ అనే విషయం తెలిసిందే. తరచూ ఆయన కార్‌ రేసింగ్‌ పోటీల్లో పాల్గొంటారు. ఇందులో పలు రికార్డులు, అవార్డులు కూడా అందుకున్నారు.

అయితే తాజాగా ఆయన కారు రేసింగ్‌లో పాల్గొనగా ఆయన కారు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు అదుపుతప్పింది. పక్కన ఉన్న ట్రాక్‌ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో హీరో అజిత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రేసింగ్‌ ప్రాక్టిస్‌ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా అజిత్‌ నటించిన విడాముయర్చి మూవీ ఈ సంక్రాంతికి థియేటర్‌లో సందడి చేయనుంది. మగిల్‌ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కీలక పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్‌ బ్యానర్లో జీకేఎం తమిళ్‌ కుమారన్‌ సమర్పణలో సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ సినిమాకు అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

ఇదిలా ఉండే టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లో అజిత్‌ హీరోగా ఓ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ టైటిల్‌. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు మార్క్‌ ఆంటోని ఫేం అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేనీ, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు.

Exit mobile version