Aishwarya Lekshmi : అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. విశాల్ నటించిన “యాక్షన్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. గత ఏడాది ‘పొన్నియిన్ సెల్వన్-1’, ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’ సినిమాలతో సూపర్ హిట్టులను అందుకొని ఫుల్ ఫార్మ్ లో ఉంది. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్-2 ’ మూవీ రిలీజ్ దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లేటెస్ట్ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..