Site icon Prime9

Tollywood: పాకిస్తాన్ లో ’మేజర్ ‘జోరు

Prime9news

major-netflix-trends-no-1

Tollywood: 26/11  ముంబయ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’మేజర్‘. ఇందులో మేజర్ సందీప్  ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి  శేషు నటించారు. ఈ చిత్రం అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలను పొందింది. 

ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై అక్కడ కూడ మంచి ఆదరణ పొందింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో, హిందీ వెర్షన్ ప్రస్తుతం ట్రెండ్స్ జాబితాలో ఒకటిగా ఉండగా, తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో కూడా  నెంబర్ వన్ గా  నిలిచింది. ఈ చిత్రం అటు ధియేటర్లు, ఇటు ఒటిటిలో విజయం సాధించడం పై దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version