Actress Mumaith Khan Hair & Beauty Academy Launch in Hyderabad: ఐటమ్స్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముమైత్ ఖాన్ గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ సీజన్ 1, డాన్స్ ప్లస్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించారు. తాజాగా, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్‌ను ముమైత్ ఖాన్ ప్రారంభించింది. ఈ అకాడమీలో భాగంగా బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌లో కొత్త శకానికి నాంది పలుకుతూ సదస్సు నిర్వహించారు. ఇందులో మేకప్, హెయిర్, బ్రైడల్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్ కేర్, వెల్‌నెస్‌లో నైపుణ్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వీలైక్ అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్‌తో పాటు కోఫౌండర్స్ కెయిత్ జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్సఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ హాజరయ్యారు.
బ్యూటీ ప్రొఫెషనల్స్ భవిష్యత్తుకు వీలైక్ మేకప్, హెయిర్ అకాడమీ మార్గదర్శిలో ఉంటుందని ముమైత్ ఖాన్ అన్నారు. నేటి తరంతో పాటు భవిష్యత్తు తరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సిలబస్, మాడ్రన్ సౌకర్యాలు, ఇండస్ట్రీతోపాటు సబ్జెక్ట్ ఎక్స్‌ఫర్ట్స్ బృందంతో విద్యార్థులను తీర్చిదిద్దదమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. బ్యూటీ పరిశ్రమపై ఇష్టం ఉన్న వారిని ప్రోత్సహించడంతోపాటు వారిని ప్రేరేపించడం చేస్తామన్నారు. ప్రధానంగా బ్రైడల్, హెయిర్ మేకప్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చి వాటిపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రపంచ స్థాయిలో ట్రెయిన్డ్ స్పెషలిస్ట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముమైత్ ఖాన్ అన్నారు.
అలాగే, కోర్సు నేర్చుకుంటున్న విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణతో పాటు ప్రజెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడే విధివిధానాలపై ఫోకస్ చేయననున్నట్లు వీలైక్ కో ఫౌండర్స్ కెయిత్, జావేద్‌లు తెలిపారు. దీంతో పాటు అకాడమీ మాడ్రన్ బ్రైడల్ హెయిర్ అండ్ మేకప్ కోర్సులు, హెయిర్ స్టైలింగ్ విధానం, మేకప్ ఆర్టిస్ట్రీ, స్కిన్ ప్రొటెక్షన్ ట్రీట్ మెంట్, నెయిల్ టెక్నాలజీతో పాటు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లు కూడా అందిస్తుందన్నారు. ప్రతీ ప్రోగ్రామ్‌లో ఆవిష్కరణ, సృజనాత్మకత పెంపొందించేలా ప్రామాణాలకు అనుగుణంగా రూపొందించామన్నారు. ప్రజెంట్ వరల్డ్ వైడ్ ఉన్న సెలూన్ విధి విధానాలను అనుసరిస్తూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తున్నట్లు తెలిపారు. వీలైక్ మేకప్, హెయిర్ అకాడమీ హెల్పింగ్, నేర్చుకునే టీమ్స్ ల వారీగా ప్రోత్సహించేందుకు అకాడమిక్ ఆపర్‌లతో పాటు ఇతర ప్రయోజనాలు ఇవ్వనుందన్నారు.