Site icon Prime9

Keerthi Suresh : పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన “కీర్తి సురేష్”.. మీ అందరికి నా పెళ్లిపై ఎందుకంత ఆసక్తి అంటూ ఫైర్

actress keerthi suresh clarity on marriage rumours

actress keerthi suresh clarity on marriage rumours

Keerthi Suresh : తనదైన అందం, అభినయంతో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కీర్తి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే నానితో పాటు దసరా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇటీవల గత కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కీర్తి తన ఫ్రెండ్ తో తిరగగా పెళ్ళికొడుకు అతనే అని కూడా వార్తలు వైరల్ అవ్వడంతో కీర్తి దీనిపై క్లారిటీ ఇచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే చెప్తాను అని ట్వీట్ కూడా చేసింది.

తాజాగా కీర్తి నటించిన మామన్నన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేసిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అందులో భాగంగా కీర్తికి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పలువురు తమిళ మీడియా ప్రతినిధులు కీర్తిని పెళ్లి గురించి అడగడంతో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నా పెళ్లి పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఎందుకు పెళ్లి గురించే అడుగుతారు. మీ అందరికి నా పెళ్లిపై ఎందుకంత ఆసక్తి ? నేను పెళ్లి చేసుకుంటే నేనే స్వయంగా చెప్తాను అని తెలిపింది. దీంతో మరోసారి కీర్తి ఇప్పట్లో తన పెళ్లి లేదని క్లారిటీ ఇచ్చింది.

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “ (Keerthi Suresh). ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. దర్శకనిర్మాతలు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకున్నారు. కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేయడంతో కీర్తి నటించిన ఏ ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా సక్సెస్ కాలేదు. ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించాయి.

కాగా రీసెంట్ గా రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ సినిమాలో రజినీకి చెల్లెలిగా కనిపించింది ఈ భామ. ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చినా… హిట్ టాక్ ను సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన గుడ్ లక్ సఖి కూయ ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇక భారీ ఆశలు పెట్టుకొని నటించిన మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ నాని దసరా సినిమాతో మంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. త్వరలోనే రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది.

Exit mobile version