Site icon Prime9

Hero Vishal Injured: షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్

Hero Vishal Injured: హీరో విశాల్ తన రాబోయే చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ చిత్రానికి సంబంధించి చెన్నైలో ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా విశాల్ ఒక స్టంట్ చేస్తూ గాయపడ్డాడు. విశాల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. గాయం కారణంగా ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్ నిలిపివేయబడింది మరియు విశాల్ పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని టీమ్ తెలిపింది.

గతంలో ‘లాఠీ’ షూటింగ్ సమయంలో విశాల్ ఒక ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్ సందర్బంగా గాయపడ్డాడు. మరోవైపు ప్రమాదం గురించి తెలుసుకున్న విశాల్ అభిమానులు ఆందోళన చెందారు. విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version