Actor Surya : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆస్కార్ వేడుకలు మన ఇండియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఎప్పుడూ ఆస్కార్ పై పెద్దగా దృష్టి పెట్టని మన వాళ్ళు.. ఈ సారి ఆస్కార్ ను లైవ్ చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇక మన ఇండియన్ యాక్టర్స్ ఆస్కార్ కోసం తమ ఓటును వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. నాటునాటుకు ఆస్కార్ రావాలని ఇండియన్స్ అంతా కోరుకుంటున్నారు. అవార్డుల ప్రదానోత్సవం వేడుకలో ఆర్ఆర్ ఆర్ చిత్ర యూనిట్ పాల్గొననుంది. ఈనెల 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానవోత్సవం జరగనుంది.
ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన ఈ పాట.. ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఇక ఇప్పటికే ఈ పాట ఆస్కార్ బరిలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ రోజు ఈ పాటని లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు అకాడమీ తమ సోషల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మార్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుండడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం అని చెప్పాలి.
మరో మూడు రోజుల్లో ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఇక ఇది అలా ఉంచితే.. ఇప్పటికే జ్యూరీలో సభ్యులుగా ఉన్న మన ఇండియన్ స్టార్స్ తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య.. తన ఓటు వేసినట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో సూర్య తన ఓటును ఎవరికి వేశాడా అని అందరూ ఆసక్తిగా అడుగుతూ ఆ పోస్ట్ కి కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలవాలని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ ఆల్.. పాన్ ఇండియా ఆడియన్స్ కోరుకుంటున్నారు.
Voting done! #Oscars95 @TheAcademy pic.twitter.com/Aob1ldYD2p
— Suriya Sivakumar (@Suriya_offl) March 8, 2023
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్ లను సాధించింది. ఆస్కార్ తరువాత అంతటి అవార్డ్ గోల్డెన్ గ్లోబ్ ను ఆర్ఆర్ఆర్ మూవీ సాధించింది. వాటితో పాటు.. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ నుంచి ఏకంగా 5 అవార్డ్ లను సాధించింది ఆర్ఆర్ఆర్. ఇక రాజమౌళి రెండు నెలల నుంచి అక్కడే ఉంటూ.. సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాదు అందుబాటులో ఉన్నప్పుడు స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తూ.. హాలీవుడ్ జనాలలో మన సినిమాను ఎక్కించేస్తున్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/