Actor Prabhu : ప్రముఖ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. తమిళ, తెలుగు నాట ప్రభు.. ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శివాజీ గణేషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సొంత స్టార్ డంను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానూ రాణించాడు. సపోర్టివ్ రోల్స్‌తోనే ప్రభుకి తెలుగులో ఎక్కువగా క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. చంద్రముఖి, డార్లింగ్ సినిమాలతో ప్రభు తెలుగు వారికి మరింతగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ప్రభు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, వారసుడులో కూడా నటించారు. ఇక ప్రభు రజినీకాంత్‌ల మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిందే. రజినీకాంత్ సినిమాల్లో ప్రభుకి ప్రత్యేకమైన పాత్రలుంటాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చంద్రముఖి సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే?
అయితే ప్రభు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన అస్వస్థతకు గురవ్వగా.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రభు బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్య తీవ్రం కావడంతో మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్‌వే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభును పరీక్షించిన వైద్యులు యూరిత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుని డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు.
ప్రభు ఆసుపత్రిలో చేరారనే వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ప్రభు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే.. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ప్రభు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకొని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా ఇటీవల సినీ పరిశ్రమను వరుస మరణాలు కలచి వేస్తున్నాయి. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పేరున్న నటులు ఎందరో పలు కారణాలతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తాజాగా కళాతపస్వి విశ్వనాథ్, ప్రముఖ గాయని వాణీ విశ్వనాథ్, తారకరత్న, ప్రముఖ కమెడియన్ మయిల్ స్వామి ఇలా పలువురు మృత్యువాత పడటం సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే ప్రభు అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో ఒకింత ఆందోళన చెందినప్పటికి.. ఆయన క్షేమం గానే ఉన్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/