Prabhu Ganesan Discharged From Hospital: నటుడు ప్రభు గణేశన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ లెజెండరీ నటుడైన శివాజి గణేశన్ తనయుడు ప్రభు. హీరో తమిళంలో పలు చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం సహా నటుడి పాత్రలు చేస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రముఖి, డార్లింగ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే కొంతకాలంగా ప్రభు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.
ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించిన ఓ వార్తల బయటకు వచ్చింది. అది తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఇటీవల ఆస్వస్థకు గురైన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు మెదడులో వాపు ఉన్నట్టు గుర్తించి ఆయనకు సర్జరీ చేశారు. ఆ సర్జరీ విజయవంతం కావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని ఆయన టీం ప్రకటన ఇచ్చింది.
ఇటీవల జ్వరం, తలనొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు మెదడు రక్తనాళంలో వాపు ఉన్నట్టు గురించారు. దీంతో ఆయనకు చిన్నపాటి సర్జరీ చేసినట్టు ఆయన టీం స్పష్టం చేసింది. కాగా ప్రభు తంబి, అగ్ని నక్షత్రం, చార్లీ చాప్లిన్, మనసుక్కుల్ మతప్పు, అగ్ని నక్షత్రం, వంటి పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఇక తెలుగు చంద్రముఖి, డార్లింగ్, ఆరెంజ్, దరువు, దేనికైనా రెడీ, ఒంగోలు గిత్త, వారసుడు వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు. దాదాపు 200పైగా సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అజిత్ జోడిగా త్రిష నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటుంది.