Prime9

Actor Nassar : సినీ పరిశ్రమలో మరో విషాదం.. విలక్షణ నటుడు నాజర్ తండ్రి మృతి

Actor Nassar : చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది.  నిన్న రాత్రి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విలక్షణ నటుడు నాజర్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మెహబూబ్‌ బాషా కొన్ని గంటల క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈరోజు పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని చెంగల్పట్టులో గల తన నివాసంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తండ్రి మరణంతో నాజర్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా నాజర్‌కి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మెహబూబ్‌ బాషా అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. హీరోగా నుంచి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో నటించి అందరికీ సుపరిచితులు అయ్యారు నాజర్. 1985లో కె బాలచందర్‌ రూపొందించిన `కల్యాణ అగథిగల్‌` చిత్రంతో నటుడిగా మారిన ఆయన తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

Exit mobile version
Skip to toolbar