Site icon Prime9

పద్మజా రాజు : అందాల నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం

Padmaja Rani

Padmaja Rani

Padmaja Raju : ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాత.

పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా “గోకులంలో సీత, తొలిప్రేమ” వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు.

ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే యేడాది తన తనయుణ్ణి నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు.

Exit mobile version