Site icon Prime9

Javed Akhtar: హిందీలోనూ దక్షిణాది నటులదే హవా – అసలు బాలీవుడ్‌కి ఏమైంది? – రచయిత ఆవేదన

Javed Akhtar Comments Why South Movies Dominate Bollywood: ఇటీవల కాలంలో బాలీవుడ్‌ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. స్టార్‌ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటే.. దక్షిణాది చిత్రాలు మాత్రం రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప 2 హిందీ బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే టైంలో విడుదైన స్త్రీ, ఛావా చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ, బ్లాక్‌బస్టర్‌ బాలీవుడ్‌ చిత్రాలు చూసి చాలా కాలం అవుతుంది. అదే టైంలో సౌత్‌ సినిమాలు బి-టౌన్‌లో హవా చూపిస్తున్నాయి.

హిందీలోనూ వారిదే హావా..

సౌత్‌లో హిస్టారికల్‌, మైథలాజికల్‌ వంటి చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తరుణంలో బాలీవుడ్‌ అదే మూస కథలు, యాక్షన్‌ చేస్తూ హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. దీంతో నార్త్‌ ఆడియన్స్‌కి దక్షిణాది సినిమాలు సరికొత్తగా అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ కరువైందనే చెప్పాలి. హిందీ చిత్రాలు వరుసగా డిజాస్టర్‌ అవ్వడం.. అదే సమయంలో సౌత్‌ సినిమాలు అక్కడ రికార్డ్స్ క్రియేట్‌ చేస్తుండటంపై తాజాగా ఓ సినీయర్‌ రచయిత స్పందించారు. బాలీవుడ్‌ సినీయర్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ ఇటీవల జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటా సరికొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా గతంతో పోలీస్తే, హిందీ ప్రేక్షకులు బాలీవుడ్‌ సినిమాలకు కనెక్ట్‌ కాలేకపోతున్నారని జావేద్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డారు.

సౌత్ సినిమాలకు ఇక్కడ కోట్ల వసూళ్లు

ముక్కు, ముఖం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఇక్కడి బాక్సాఫీసు వద్ద వందల కోట్లు రాబడుతున్నాయన్నారు. ఒకప్పటితో పోలీస్తే మన హిందీ సినిమాలకు ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. అదే టైంలో హిందీలో డబ్‌ అవుతున్న దక్షిణాది చిత్రాలు కోట్లలో వసూళ్లు సాధిస్తున్నాయి. హిందీ ఆడియన్స్‌కి పెద్దగా పరిచయమే లేని నటుల చిత్రాలు ఇక్కడ రూ. 600 నుంచి రూ. 700 వరకు కోట్లు సాధిస్తున్నాయి. మన హిందీ పరిశ్రమకు ఏమైంది అని ఆయన అన్నారు. ఇదే విషయంపై ఆమిర్‌ని అభిప్రాయాన్ని కోరారు. హిందీ పరిశ్రమ వెనకబడిపోవడంపై ఆమిర్‌ను తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగారు.

మన సినిమాని మనమే చంపేస్తున్నాం: ఆమిర్

దీనికి ఆమిర్‌ స్పందిస్తూ.. ఇక్కడ సమస్య ప్రాంతీయం కాదన్నారు. ఉత్తరాది, దక్షిణాది అనేది సమస్య కాదని, మనం ఎదుర్కొంటున్న సమస్య వేరే అన్నారు. “మా సినిమా చూడండి అని ప్రేక్షకులు అభ్యర్తించే ఏకైక ఇండస్ట్రీ మనదే. లేదంటే ఎనిమిది వారాల్లో ఇంట్లోనే సినిమా చూసే అవకాశం కల్పిస్తాం. ఇదే బాలీవుడ్‌ బిజినెస్‌ మోడల్‌ అన్నారు. ఓటీటీకి ఒకసారి సబ్‌స్క్రిబ్సన్‌ చెల్లిస్తే చాలు సినిమాను ఎన్నిసార్లైనా, ఎక్కడైన చూడోచ్చు. ఒకే ఉత్పిత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదు.

గతంలో ఓటీటీలు లేకపోవడం వల్ల థియేటర్‌ వెళ్తేనే సినిమా చూడాల్సిన పరిస్థితి. అప్పుడు సినిమా మిస్‌ అయితే మళ్లీ ఎన్నో నెలలు గడిస్తేనే తప్ప మూవీ చూడలేం. కాబట్టి ఆడియన్స్‌ అంతా తప్పక థియేటర్లకు వచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. థియేటర్లలో సినిమా చూడకపోయిన, ఇంట్లోనే ఎంచక్కా సినిమా చూడోచ్చని అనుకుంటున్నారు. ఓటీటీ వల్ల థియేటర్లకు వెళ్లాలనే ఆసక్తి తగ్గింది. అలాంటి పరిస్థితులను మనమే కల్పించాం. మన సొంత వ్యాపార నమునాతో మన సినిమాలను చంపుకుంటున్నా” ఆమిర్‌ ఖాన్‌ అన్నారు.

Exit mobile version
Skip to toolbar