Site icon Prime9

Aamir Khan Daughter Ira Emotional: ఆమెతో ఆమిర్‌ డేటింగ్‌ – తండ్రిని కలిసిన ఇరా, ఏడుస్తూ బయటకు.. అసలేం జరిగింది?

Aamir Khan Daughter Ira Khan Gets Emotional: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌, సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ ఇటీవలె 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో వారం రోజుల ముందే ఆయన బర్త్‌డే సందడి మొదలైంది. మీడియా, ఫ్యాన్స్‌ అంతా సోషల్‌ మీడియాలో ఆమిర్‌ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ స్పెషల్‌ డే రోజు ఆమిర్‌ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్‌నర్‌ వెతుక్కోవడంపై నెటిజన్స్‌ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా ఉంది.

ఇరా ఖాన్ ఎమోషనల్

అయితే ఆ టైంలో ఆమిర్‌ కూతురు ఇరాఖాన్‌ ముంబైలో లేని విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లిన ఆమె సోమవారం బాంద్రాలోని తన తండ్రి ఇంటికి వచ్చింది. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇరా, ఆమిర్‌కు బయటకు వచ్చారు. ఆ సమయంలో ఇరా ఏడుస్తూ కనిపించింది. ఆమె కళ్లు కన్నీటితో నిండి ఉన్నాయి. ఎమోషనల్‌ అవుతున్న కూతురిని ఆమిర్‌ అప్యాయంగా హత్తుకుని ముద్దాడారు. ఆ తర్వాత ఆమిర్‌, ఇరా వేరు వేరు కార్లో వెళ్లిపోయిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎమోషనల్‌ అవుతున్న ఇరా కారు ఎక్కి వెళుతుండగా మీడియా తనని వెంబడిస్తూ వీడియోలు తీస్తూనే ఉన్నారు.

‘ఆమిర్ మంచి తండ్రి కాదు’

కారు ఎక్కిన తర్వాత కూడా ఆమె తన ఏడుపును అదుపు చేసుకోలేకపోయిన దృశ్యం ప్రతి ఒక్కరిని హత్తుకుంటోంది. దీంతో ఆమెకు ఏమైంది అని అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్రైవసీ గౌరవం ఇవ్వాలని, వారు సెలబ్రిటీల కంటే ముందు మనుషులనే విషయం గుర్తించాలని కొందరు మీడియాపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమిర్‌ని ఉద్దేశిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమిర్‌ మంచి తండ్రి కాదని, ఈ 60 ఏళ్ల వయసులో కూడా తన వ్యక్తిగత సంతోషం, జీవితం గురించే ఆలోచిస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. పిల్లలను పక్కన పెట్టి తన స్వార్థం చూసుకుంటున్నాడంటూ ఆమిర్‌ని తప్పుబడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా ఇరా మెంటల్ హెల్త్‌ ఇష్యూస్‌ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె డిప్రెషన్‌ చికిత్స తీసుకుంది. దాని నుంచి ఆమె ఎలా బయటపడింది, తన ఒత్తిడికి కారణాలంటనే విషయాలను తరచూ తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేసుకుంది. అంతేకాదు ఒత్తిడి నుంచి బయటపడటానికి ఏం చేయాలనే విషయాలను పంచుకుంటూ అవగాహన కల్పిస్తుంది. ఇరా ఆమిర్‌ ఖాన్‌ మొదటి భార్య సంతానం. కిరణ్‌ రావు కంటే ముందు ఆమిర్‌ రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్‌ ఖాన్‌, ఇరా ఖాన్‌లు జన్మించారు. ఆ తర్వాత రీనాకు విడాకులు ఇచ్చి కిరణ్‌ రావును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2022లో కిరణ్‌ రావుకి విడాకులు ఇచ్చి గౌరి స్ప్రాట్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు.

Exit mobile version
Skip to toolbar