Prime9

Theif in Salman Khan Home: సల్మాన్‌ ఇంట్లోకి చోరబడేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు వ్యక్తులు.. అరెస్టు చేసిన పోలీసులు

2 Arrested after Entered Salman Khan Apartment illegally: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఈ మధ్య హత్య బెదిరింపులు ఎక్కువైన సంగతి తెలిసిందే. సల్మాన్‌ను చంపాస్తేమంటూ గ్యాంగస్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ బృందం తరచూ బెదిరింపులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో సల్మాన్‌కు ప్రభుత్వం భారీ వై క్యాటగిరి భద్రతను కల్పించింది. బెదిరింపులు నేపథ్యంలో సల్మాన్‌ కూడా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారును ప్రత్యేకంగా విదేశాల నుంచి తెప్పించుకున్నారు. అలాగే తన ఇంటి బాల్కానీకి బుల్లెట్‌ ఫ్రూవ్‌ అద్దాన్ని అమర్చారు.

 

ఇన్ని భద్రతల నడుమ తాజాగా సల్మాన్‌ ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వేరు వేరుగా చొరబడేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రెండు రోజుల క్రితం జితేంద్ర కుమార్‌ సింగ్ అనే వ్యక్తి గెలాక్సీ అపార్టుమెంట్‌లోకి ప్రవేశించినట్టు ముంబై పోలీసులు తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బంది అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సల్మాన్‌ను కలిసేందుకు తాను ఇంట్లోకి వెళ్లానని అతడు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

 

పోలీసుల సమాచారం ప్రకారం.. “మే 20న ఉదయం 10 గంటల సమయంలో సల్మాన్‌ ఇంటి ముందు అనుమానస్పదంగా తిరుగుతూ ఓ వ్యక్తి కనిపించాడు. దీంతో మా భద్రత సిబ్బంది అతడిని గుర్తించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో అతడు కోపంతో ఫోన్‌ విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు సాయంత్రం అతడు మళ్లీ సల్మాన్‌ గెలాక్సీ అపార్టుమెంట్‌ వద్ద కనిపించాడు. ఆ అపార్టుమెంట్‌లో ఉంటున్న మరో వ్యక్తి కారు వెనకాల నక్కీ లోపలికి ప్రవేశించాడు. అదే సమమంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ అతడిని అడ్డుకుని బాంద్రా పోలీసులకు సమాచారం అదించింది.

 

సమాచారం పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అరెస్ట్‌ చేశారు. తాను చత్తీష్‌గడ్‌ నుంచి వచ్చానని, సల్మాన్‌ కలవాలనుకుంటున్నట్టు అతడు విచారణలో చెప్పాడు. పోలీసులు అనుమతించకపోవడంతో తాను కారు వెనకలా దాక్కుని లోపలికి వెళ్లానని అతడు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఇవాళ ఇషా ఛబ్రా (32) అనే మహిళా సల్మాన్‌ నివాసం ఉండే భవనం లిఫ్ట్‌ ఏరియా వరకు వెళ్లింది. ఆమెను గుర్తించిన భద్రత సిబ్బంది అప్రమత్తమైన అడ్డుకున్నారు. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, బాంద్రా పోలీసులకు సమాచారం అందించి, ఆమెను వారికి అప్పగించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar