Site icon Prime9

IIIT – Bangalore: త్రిబుల్ ఐటీ బెంగళూరు ప్రత్యేకత ఏమిటో తెలుసా?

IIIT Bangalore

IIIT Bangalore

IIIT – Bangalore: త్రిబుల్ ఐటీ హైదరాబాద్  తెలిసినట్లుగా చాలా మందికి త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి తెలియదు. అయితే ఇది కూడా అత్యున్నత ప్రమాణాలతో మంచి కోర్పులతో ఉన్న సంస్దని ఇక్కడ చదివిన వారికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రసిద్ద విద్యానిపుణుడు   డాక్టర్ సతీష్ కుమార్ చెబుతున్నారు. త్రిబుల్ ఐటీ బెంగళూరు లో ప్రారంభంలోనే (1998)ఎమ్మెస్సీ,ఎంటెక్ కోర్సులు పెట్టారు. అండర్ గ్రాడ్యుయేషన్ పెట్టలేదు. 2012లో ఐదేళ్ల ఎంటెక్ కోర్సు ప్రారంభించారు. అప్పటినుంచి ఈ ఇనిస్టిట్యూట్ గురించి తెలియడం జరిగింది. సీఎస్ఈ. ఈసీఈ రెండు బ్రాంచిలు ఉన్నాయి. నాలుగేళ్లు కోర్సు తరువాత ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. తరువాత డిగ్రీ ప్రదానం చేస్తారని సతీష్ కుమార్ తెలిపారు.

ఆరు రకాల స్పెషలైజేషన్లు.. (IIIT – Bangalore)

ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆరు రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. విద్యార్దులు తమకున్న అభిరుచిని బట్టి ఎందులోనయినా ప్రావీణ్యం సంపాదించవచ్చు. ఫీజు ఏడాదికి నాలుగు లక్షలు ఉంటుంది. ఇంటర్న్ షిప్ సమయంలో 60 వేల నుంచి 70 వేల వరకూ స్టూడెంట్స్ సంపాదించవచ్చు. నాలుగురకాల స్కాలర్ షిప్పులు విద్యార్దులకు ఉంటాయి. జేఈఈ టాప్ 5 ర్యాంకర్లకు ఫీజు ఉండదు. 1000 లోపు ర్యాంకు వస్తే 60 శాతం ఫీజు మినహాయింపు ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు. జీపీఏ 3.6 వస్తే 50 వేల రూపాయల స్కాలర్ షిప్ వస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో నేరుగా పీహెచ్ డీ ప్రవేశాలు లభిస్తాయి. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. 20 వేల ర్యాంకు వచ్చినా ఇక్కడ సీటు వస్తుంది. చాలా ఎన్ఐటీ ల కంటే ఇక్కడ మంచి ప్యాకల్టీ ఉండటం వలన ఇక్కడ చేరడం మంచిదని సతీష్ కుమార్ చెబుతున్నారు. విద్యార్దులు ఈ కోర్సులకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.

Exit mobile version