Maths and Computers course: ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ లేనా? ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ ప్రత్యేకత ఏమిటి? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ విద్యార్దులకు ఉపయోగపడే సూచనలిచ్చారు.
సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్దులు ఎంచుకునే, డిమాండ్ ఉన్న కోర్సులు ఏమిటంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ. కంప్యూటర్ సైన్స్ రాకపోతే ఈసీఈ తీసుకునే వారి సంఖ్య పెరగుతోంది. అయితే ఈ విషయంలో విద్యార్దులు, వారి తల్లిదండ్రులు పునరాలోచన చేయాలని సతీషక్ చెబుతున్నారు. ఎందుకంటే ఈసీఈ చదివిన వారు ఎక్కువ మంది సంబంధిత కంపెనీలలో సెలక్టు కావడం లేదు. కోర్ కంపెనీల్లో చేయాలంటే మంచి కాలేజీల్లో చదవాలి. లేకపోతే మంచి జాబ్ చేయాలన్ని వారి కోరిక తీరదు. కానీ టాప్ కాలేజీలకే కోర్ కంపెనీలు వస్తాయి. బాగా డెప్త్ నాలెడ్జ్ ఉన్నవారినే ఈ కంపెనీలు తీసుకుంటాయి. అందువల్ల వారు తమ ఎంపికపై ఆలోచన చేయాలని అన్నారు.
ప్రపంచమంతా టెక్నాలజీతో నడుస్తోంది. దీనిని అందిపుచ్చుకోవాలన్నా. అవగాహన పెంచుకోవాలన్నా మ్యాధమెటిక్స్ బ్యాగ్ గ్రౌండ్ ఉండాలి. ఇందులో స్ట్రాంగ్ గా ఉంటే రీసెర్చి వైపు వెళ్లడం సులువు అవుతుంది. మ్యాధమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ . కన్సల్టెన్సీ కంపెనీలు ఎక్కువ జీతాలను ఆఫర్ చేస్తాయి. మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ వారికి వీటిలో మంచి డిమాండ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ కు వెళ్లాలంటే మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ తో వెళ్లాలి. అయితే మ్యాధ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే దీనికి వెళ్లాలి. వీరికి ప్రారంభంలో జీతాలు తక్కువగా ఉన్నా తరువాత మాత్రం బాగుంటుంది. అందువలన ఈ కోర్సును చేసిన వారికి అవకాశాలకు కొదవ లేదని డాక్టర్ సతీష్ చెబుతున్నారు. విద్యార్దులు ఈ కోర్సులకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్8886629883 ను సంప్రదించవచ్చు.