Site icon Prime9

Vijayawada: రేపే ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి బొత్స

Vijayawada

Vijayawada

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 6న (శనివారం) ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పది ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఎపుడూ లేని విధంగా అతి తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నట్టు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పది ఫలితాల విషయాన్ని వెల్లడించారు.

 

18 రోజుల్లో విడుదల(Vijayawada)

గత ఏడాది 28 రోజుల్లో ఫలితాలు విడుదల చేయగా.. ఈ ఏడాది 18 రోజుల్లో విడుదల చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పది పరీక్షల ఫలితాల విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి కూడా అధికారంగా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించారు. 19 నుంచి 26వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్టు దేవానంద రెడ్డి తెలిపారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6 లక్షల మంది కాగా.. మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://www.results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

 

https://www.results.bse.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.

అనంతరం హొం పేజీపై ఏపీ టెన్త్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మార్కుల షీట్ ఓపెన్ అవుతుంది.

అనంతరం మార్కుల షీట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

 

Exit mobile version