TS Polycet Results: తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
రిజల్ట్స్ కోసం ఇక్కడ చూడండి..
https://polycet.sbtet.telangana.gov.in/#!/index/GetRankCard
తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. మే 17న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తంగా 98,273(92.94%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.