Site icon Prime9

MBBS in UK: యూకేలో ఎంబీబీఎస్ చదవడానికి UCAT ఎగ్జామ్ రాయాలి..

satish

satish

MBBS in UK: యూకే లో మెడిసిన్ చదువుదామనుకునే వారికి ముఖ్యంగా వచ్చే ఏడాది అడ్మిషన్లు కోరుకునే వారు వెంటనే అప్లై చేసి ప్రవేశ పరీక్షకు సిద్దమవ్వాలి. ఈ పరీక్షను UCAT అంటారు. అంటే యూకే క్లినికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ .. యూకేలోని 35 కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువాలనుకునే విద్యార్దులు 2024 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 20న నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ 21లోపు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ప్రవేశ పరీక్షరాయవచ్చు. దీనిలో స్కోరును బట్టి వచ్చే ఏడాది ప్రవేశాలకు అనుమతి ఉంటుంది.

5 కాలేజీల కంటే అప్లై చేయడానికి లేదు..(MBBS in UK)

ఇండియాలో 12 వ తరగతి చదివిన విద్యార్దులు దీనికి అప్లై చేసుకోవచ్చు. నీట్ పరీక్షలాగ దీనికి ఫిజిక్స్,బయాలజీ అవసరం లేదు. ప్రవేశ పరీక్షలో వెర్బల్ రీజనింగ్ , క్వాంటిటివ్ రీజనింగ్. అబ్ స్ట్రాక్ట్ రీజనింగ్ , డెసిషన్ మేకింగ్ తదితర విభాగాలు ఉంటాయి. నాలుగు విభాగాలకు కలిపి 3600 మార్కులకు ప్రవేశపరీక్ష ఉంటుంది. వీటికి అదనంగా సిట్యుయేషన్ జడ్జిమెంటల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒక్క విద్యార్ది 5 కాలేజీల కంటే అప్లై చేయడానికి వీలు లేదు. పరీక్షలో 2850 మార్కులు వస్తే మంచి కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది. ఇండియాలో 30 పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. గత ఏడాది 37 వేల మంది ఈ పరీక్ష రాసారు. ప్రవేశ పరీక్ష స్కోరు, అకడమిక్ స్కోర్, స్కిల్స్, ఇంటర్వ్యూ వీటన్నింటిని బట్టి అడ్మిషన్ ఉంటుంది. ఇది కాలేజీలను బట్టి మారుతూ ఉంటుంది. ఆసక్తి గల విద్యార్దులు వెంటనే అప్లై చేసి సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రవేశ పరీక్ష పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్ స్కోరు కొన్ని ఇతర దేశాల్లో మెడిసిన్ అడ్మిషన్లకు ప్రయారిటీ ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ప్రముఖ విద్యానిపుణుడు  డాక్టర్ సతీష్  8886629883 ను సంప్రదించవచ్చు.

Exit mobile version