Site icon Prime9

SSC CGL Jobs: డిగ్రీ విద్యార్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు… ఎస్ఎస్సీ అభ్యర్థులకు గెట్ రెడీ

ssc cgl 2022 notification

ssc cgl 2022 notification

SSC CGL Jobs: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికుల కోసంssc cgl
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్‌) పరీక్ష-2022కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలోని దాదాపు 20వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు పేర్కొనింది.

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఐబీ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎవోఆర్‌), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎంవోఈఏ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎఫ్‌హెచ్‌క్యూ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఈ&ఐటీ) వంటి వివిధ పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాన్ని అనుసరించి 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని ఎస్ఎస్సీ తెలిపింది. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యుర్థులను ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వగా చివరి తేదీ 08.10.2022 సాయంత్రం 4గంటల ముగుస్తుంది. ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా అప్లై చెయ్యవచ్చు. ఇతర పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ సంప్రదించండి.

ఇదీ చూడండి: TSPSC Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు..!

Exit mobile version